- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్లాస్ అండ్ సింపుల్ లుక్‌లో కవ్విస్తున్న ఐశ్వర్య లక్ష్మి
రెడ్ అవుట్‌ఫిట్‌లో ఐశ్వర్య లక్ష్మి రాయల్ లుక్.

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2017లో విడుదలైన మలయాళ చిత్రం 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్'తో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత ప్రధానంగా తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుంది.
తెలుగులో 'అమ్ము' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐశ్వర్య, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న 'సంబరాల ఏటిగట్టు' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. కొంతకాలం క్రితం విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన 'గట్టా కుస్తీ' సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది.
ఈ చిత్రం తెలుగులో 'మట్టి కుస్తీ' పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన 'గట్టా కుస్తీ 2' జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల్లో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యం ఇస్తూ క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి, సోషల్ మీడియాలోనూ అదే హుందాతనాన్ని కొనసాగిస్తోంది.
స్కిన్ షోకు దూరంగా ఉంటూ ఎలిగెంట్ ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా రెడ్ కలర్ క్లాసీ డ్రెస్‌లో మెరిసిన ఐశ్వర్య లక్ష్మి తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ముఖంపై సున్నితంగా జారిన కురులు, మెడలో చిన్న నెక్లెస్, కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇచ్చిన పోజులు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. మొత్తం మీద ఈ ఫొటోల్లో ఐశ్వర్య లక్ష్మి క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేస్తూ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






