Janhvi Kapoor : పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా జాన్వీ!

by Chukka Sudharani |   (  Updated:2026-05-15 15:41:06  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.

Janhvi Kapoor : పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా జాన్వీ!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ అనే పాత్రలో నటిస్తుంది. ఈ పాత్ర కోసం జాన్వీ తానే స్వయంగా విజయనగరం యాసలో డబ్బింగ్ చెబుతోందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. పెద్ది ప్రమోషన్స్‌కు జాన్వీ దూరంగా ఉంటుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదని టాక్. ఈ పాన్ ఇండియా మూవీ జాన్వీ కెరీర్‌కు కీలకం కానుంది. హిట్ అయితే మరిన్ని తెలుగు అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉండగా.. ఇలాంటి సమయంలో ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటం జాన్వీకి మైనస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, సాయి కుమార్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

‘పెద్ది’ సెట్స్‌లోకి మీర్జాపూర్ స్టార్.. రాంబుజి మాస్ ఎంట్రీతో భారీ హైప్!

Next Story