- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ సెట్స్‌లోకి మీర్జాపూర్ స్టార్.. రాంబుజి మాస్ ఎంట్రీతో భారీ హైప్!
‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ పాత్రకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘పెద్ది’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచిన చిత్రబృందం, ప్రేక్షకులను ఆకట్టుకునేలా వరుసగా క్రేజీ అప్డేట్స్ ఇస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ‘పెద్ది’ మూవీ నుండి మేకర్స్ ఒక సర్‌ప్రైజింగ్, పవర్‌ఫుల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ పాత్రకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన రాంబుజి అనే చాలా కీలకమైన క్యారెక్టర్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన వీడియోలో దివ్యేందు శర్మ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఆయన ఒక లోకల్ క్రికెట్ గ్రౌండ్‌లో చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని పక్కా రస్టిక్ అవతారంలో కనిపిస్తున్నారు. ఈ వీడియో పోస్ట్‌కు చిత్రబృందం "ఆట మొదలుకాబోతోంది. అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జత చేసింది. ఈ లుక్, క్యాప్షన్ చూస్తుంటే.. సినిమాలో రామ్ చరణ్‌తో పాటు దివ్యేందు శర్మ కూడా క్రికెట్ ఆడే ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఒక్క వీడియోతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. కాగా.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘పెద్ది’ సినిమా జూన్ 4న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది. అలాగే జగపతి బాబు, సాయి కుమార్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కూడా ఇందులోకీలక పాత్రలో కనిపించబోతుండటం విశేషం. వృద్ధి సినిమాస్, సుకుమార్ వ్రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఏమున్నాడ్రా బాబూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్!






