- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏమున్నాడ్రా బాబూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్!
ఈ లీక్డ్ పిక్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే ఇందులో ప్రభాస్ ఎవరూ ఊహించని విధంగా సరికొత్త అవతారంలో దర్శనమిచ్చారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైన్‌లో పెడుతూ బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలు ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ ఒకటి. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్, బ్యూటీఫుల్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి ప్రభాస్‌కు సంబంధించిన ఒక క్రేజీ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ లీక్డ్ పిక్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే ఇందులో ప్రభాస్ ఎవరూ ఊహించని విధంగా సరికొత్త అవతారంలో దర్శనమిచ్చారు.
లీకైన ఫొటోలో ప్రభాస్ ఎంతో ట్రెడిషనల్ గా పంచెకట్టులో కనిపిస్తున్నారు. ఒకవైపు పక్కా క్లాసీగా పంచెకట్టులో ఉంటూనే.. మరోవైపు చేతిలో పవర్‌ఫుల్ గన్ పట్టుకుని, పొడవాటి జుట్టు , కళ్లకు స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని కనిపించారు. ఈ రా అండ్ రస్టిక్ లుక్ చూస్తుంటే సందీప్ రెడ్డి వంగా ఈసారి ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని ఒక ఊరమాస్, వైల్డ్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఫొటో నెట్టింట కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. డార్లింగ్ కటౌట్‌కు ఈ పంచెకట్టు, గన్ కాంబినేషన్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏమున్నాడ్రా బాబు.. అస్సలు చూపు తిప్పుకోలేకపోతున్నాం, బాక్సాఫీస్ వద్ద ఈసారి పూనకాలే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






