‘జమానా’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-29 04:21:12  IST  )

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత.

‘జమానా’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం
X

దిశ, సినిమా : సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతోపాటు హీరో ఆకాష్ పూరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ... ‘‘జమాన’ ట్రైలర్ బాగుంది. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. మంచి కాన్సెప్ట్‌తో జనవరి 30న విడుదల కాబోతున్న ఈ మూవీని అందరూ థియేటర్స్‌లో చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ సినిమా అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలనుకుటున్నా’ అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో వినోదంతోపాటు ఊహించని ట్విస్టులు ఉంటాయని తెలిపాడు దర్శకుడు భాస్కర్ జక్కుల.

MORE NEWS : షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘హ్రీం’

Next Story