షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘హ్రీం’

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-29 04:22:50  IST  )

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అంటే దర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన భీజాక్షరం.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘హ్రీం’
X

దిశ, సినిమా : తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అంటే దర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన భీజాక్షరం. ఇదే అక్షరాన్ని టైటిల్‌గా తీసుకుని.. ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ రావూరి రాజేష్. శివమ్‌ మీడియా పతాకంపై శివ మల్లాల నిర్మిస్తున్న సినిమాలో నూతన నటీనటులు పవన్‌ తాత, డాక్టర్‌ చమిందా వర్మ జంటగా నటించారు. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. శ్రీమతి సుజాత మల్లాల సమర్పిస్తున్న ఈ చిత్రం వరంగల్‌ దగ్గరలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్‌ హెచ్‌యంటీ కాలనీలోని ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

MORE NEWS : ‘జమానా’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

Next Story