- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీతా పయనం కోసం కలిసిన పాత స్నేహితులు.. జగపతి బాబును అలా ఆట పట్టించిన అర్జున్..!
సీతాపయనం సినిమా ప్రమోషన్స్ కోసం జగపతి బాబు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా అర్జున్ జగపతిబాబును సరదాగా ఆట పట్టించారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన సీతా పయనం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిరంజన్ సూదింద్ర హీరోగా నటించిన ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ నటించడమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ధ్రువ సర్జ, సత్యరాజ్, బిత్తిరి సత్తి, కోవై సరళ ఇతర పాత్రల్లో నటించారు.
తన కూతురు ఈ సినిమాలో హీరోయిన్గా నటించడం, తాను నటించి, దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించడంతో అర్జున్ ఈ మూవీపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో అర్జున్ ప్రమోషన్ స్పీడును మరింత పెంచాడు. ఈ చిత్ర ప్రమోషన్ కోసం పాత స్నేహితుడు అయిన జగపతిబాబును కలిశాడు. జగపతిబాబును కలిసిన సమయంలో అర్జున్ ఓ గిటార్ పట్టుకొని వన్, టూ, త్రీ, ఫోర్ అంటూ సీతా పయనం మూవీలోని ఎన్నో ఎన్నెన్నో మలుపులు... ఎన్నో ఎన్నెన్నో మార్పులు అనే పాటను పాడుతుంటాడు.
ఆ సమయంలో అర్జున్ కి దోమ కుట్టడంతో ఆయన ఆ పాటను ఆపేస్తాడు. దాంతో జగపతిబాబు నువ్వు పాట ఆపినా ఎక్కడి నుండి వస్తుంది అని సరదాగా అడుగుతాడు. దాంతో ఈ పాట నేను పాడడం లేదు అంటూ పక్క వ్యక్తిని అర్జున్ చూపిస్తాడు. ఇలా సరదాగా అర్జున్, జగపతిబాబు ఇద్దరూ కలిసి ఈ సినిమా ప్రమోషన్ను చేశారు. ఇప్పటివరకు సీతా పయనం మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక సినిమా జనాలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. జగపతిబాబు, అర్జున్ కలిసి ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలలో హనుమాన్ జంక్షన్ మూవీ మంచి విజయాన్ని సాధించింది.






