- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కూతురికి ‘సీతా పయనం’ ఓ బహుమతి.. వైరల్‌గా అర్జున్ సర్జా కామెంట్స్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’.

దిశ, సినిమా: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుండగా.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘మంచి మనిషి, రియల్ జెంటిల్మెన్ అర్జున్ గురించి ఈ ఈవెంట్‌కు వచ్చాను. అర్జున్ దర్శకత్వం వహించిన ‘జై హింద్ 2’ చిత్రంలో నేను నటించాను. ఈ చిత్రంతో ఐశ్వర్యకు మంచి పేరు రావాలి, అర్జున్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీత దర్శకుడు. అచెంచలమైన భక్తి గల అర్జున్‌కి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శక, నిర్మాత అర్జున్ సర్జా మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ అనేది ఒక్కరి ప్రయాణం కాదు. నా కూతురిని ఓ మంచి కథతో, పాజిటివిటీ ఉన్న సినిమాతో పరిచయం చేయాలని అనుకున్నాను. ఇదొక డిఫరెంట్ జానర్ కథ. నా కూతురికి ఓ బహుమతిలా ఈ సినిమాని ఇవ్వాలని అనుకున్నాను. జనాలకు ఓ మంచి చిత్రాన్ని ఇవ్వాలనే బాధ్యతతో ఈ చిత్రాన్ని తీశాను. సున్నితమైన అంశాలతో తెరకెక్కించినా కూడా అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. బంధాల విలువలను చాటి చెప్పే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది. మూవీని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.






