అనిల్ రావిపూడికి పెద్ద గాలం వేసిన దిల్ రాజు

by Pulgam srinivas |   (  Updated:2026-04-06 13:07:15  IST  )

'lik' ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ... ఒకవేళ అనిల్ రావిపూడి హీరోగా సినిమా చేస్తే, ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తానని స్టేజ్‌పైనే ప్రకటించారు.

అనిల్ రావిపూడికి పెద్ద గాలం వేసిన దిల్ రాజు
X

దిశ, వెబ్ డెస్క్: నిన్న రాత్రి ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన lik (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ… ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా, నటుడిగా సూపర్ సక్సెస్ సాధించాడని, ఆ స్థాయి టాలెంట్ ఉన్న వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరని చెప్పారు. అనిల్ రావిపూడి తన వద్దకు కథ చెప్పడానికి వచ్చిన ప్రతిసారి "నువ్వు హీరో మెటీరియల్" అని చెబుతుంటానని, ఒకవేళ అనిల్ హీరోగా సినిమా చేస్తే, ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తానని స్టేజ్‌పైనే ప్రకటించారు.

తాజాగా దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ హీరోగా దిల్ రాజు సీనయ్య అనే సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఏమైందో గాని ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం దిల్ రాజు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మరి త్వరలోనే అనిల్ రావిపూడితో కూడా ఈ నిర్మాత సినిమా చేస్తాడేమో చూడాలి. ఇక 'lik' చిత్రంపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ఆ హీరోయిన్‌పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

Next Story