ఆ హీరోయిన్‌పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

by Chukka Sudharani |   (  Updated:2026-04-06 13:06:38  IST  )

వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఇండిస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి.

ఆ హీరోయిన్‌పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
X

దిశ, సినిమా: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఇండిస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. దీంతో ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈయన.. ఇప్పుడు మల్టీ స్టారర్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ మేరకు విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఒక క్లీన్, టిపికల్ అనిల్ ఎంటర్‌టైన్మెంట్‌ను సిద్ధం చేస్తున్నాడు. ఈ కలయికలో సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అంతే కాకుండా ఇందులో నటించే హీరోయిన్స్‌పై ఏదో ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందులో భాగంగానే కళ్యాణ్ రామ్ సరసన యంగ్ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. తాజాగా LIK ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈ డైరెక్టర్ కృతీ శెట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘త్వరలో మనం సెట్‌లో కలుద్దాం. ఎలాగో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వా్ల్సిన అవసరం లేదు. ఇప్పటికే మనవాళ్లు రాసేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే అనిల్ ప్రాజెక్టులో కృతి భాగం అయినట్లు చెప్పకనే చెప్పేశాడు మన డైరెక్టర్.

అనిల్ రావిపూడికి పెద్ద గాలం వేసిన దిల్ రాజు

Next Story