- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాని 'ది ప్యారడైజ్' విడుదల తేదీలో చిన్న మార్పు.. బాలయ్యకు ఎదురెళ్లనున్నాడా?
ది ప్యారడైజ్ చిత్రాన్ని దసరా బరిలో నిలపాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ అనే ఊరమాస్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మమతా బైజు హీరోయిన్‌గా కనిపించనుంది. మొదట ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీన సినిమా విడుదల కాలేదు. అనంతరం ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కూడా సినిమా షూటింగ్ కొనసాగుతుండటంతో ఆ తేదీకి విడుదల కావడం కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఒకవేళ ఆగస్టు 21న సినిమా విడుదల కాకపోతే ఈ ఏడాది అక్టోబర్‌లో దసరా సీజన్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో, నందమూరి బాలకృష్ణ కూడా దసరా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే బాలయ్య – నాని మధ్య బాక్సాఫీస్ పోటీ దాదాపు ఖాయమైనట్టేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దసరా సీజన్‌లో ఒకేసారి రెండు లేదా మూడు సినిమాలు విడుదలై విజయాలు సాధించిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలైనా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






