పెద్ది ఇంటర్వెల్ బ్లాక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్

by Pulgam srinivas |

రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో పెద్ది ఇంటర్వెల్ సన్నివేశంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పెద్ది ఇంటర్వెల్ బ్లాక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీన విడుదల కానుంది. దీంతో చరణ్ ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన శివరాజ్ కుమార్‌తో కలిసి ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కుస్తీ గురువు పాత్రలో కనిపిస్తారని తెలిపారు.

ఆయన తనను శిష్యుడిగా ఎంపిక చేసే సన్నివేశం ఇంటర్వెల్‌కు ముందు వస్తుందని, అయితే శివరాజ్ కుమార్ అంత ఈజీగా తనను శిష్యుడిగా అంగీకరించరని, అందుకోసం తనకు ఎన్నో కఠిన పరీక్షలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఆ సవాళ్లను తాను ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు శివరాజ్ కుమార్ తనను ఎలా శిష్యుడిగా స్వీకరించారు? అనే అంశాలే ఇంటర్వెల్ బ్లాక్‌లో ఉంటాయని వెల్లడించారు. ఈ సన్నివేశం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని రామ్ చరణ్ అన్నారు. చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో పెద్ది ఇంటర్వెల్ బ్లాక్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story