తెలంగాణలో ‘పెద్ది’కి టికెట్ హైక్స్ లేనట్లేనా? పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్

by Pulgam srinivas |   (  Updated:2026-05-30 05:49:38  IST  )

తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను మైత్రి మూవీ మేకర్స్ వెనక్కి తీసుకుంది.

తెలంగాణలో ‘పెద్ది’కి టికెట్ హైక్స్ లేనట్లేనా? పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను జూన్ 3 రాత్రి నుంచి ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ షోలు నిర్వహించడంతో పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. అయితే తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెరుగుతాయని చాలామంది భావించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం సాధారణ టికెట్ ధరలతోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా టికెట్ ధరల పెంపు కోసం మూవీ యూనిట్ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. సినిమా జూన్ 4న విడుదల కానుండటంతో, ఆ తర్వాత విచారణ జరగడం నిరర్థకమని భావించిన మైత్రి మూవీ మేకర్స్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ‘పెద్ది’ భారీ టికెట్ ధరలతో విడుదల కానుండగా, తెలంగాణలో మాత్రం సాధారణ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రణ్‌వీర్ సింగ్ సక్సెస్ చూసి భయపడి ఇదంతా చేస్తున్నారు.. ‘డాన్-3’ వివాదంపై ఆర్జీవీ సంచలన పోస్ట్

Next Story