రణ్‌వీర్ సింగ్ సక్సెస్ చూసి భయపడి ఇదంతా చేస్తున్నారు.. ‘డాన్-3’ వివాదంపై ఆర్జీవీ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-30 05:14:43  IST  )

రణ్‌వీర్‌ను కాదు.. ముందు FWICE ని బ్యాన్ చేయాలి. ఈ యూనియన్ వ్యవస్థ చాలా పాతబడిపోయింది. ఇండస్ట్రీలో తమ పట్టును కోల్పోకుండా ఉండటానికే ఇలా డ్రామాలు ఆడుతున్నారు..

రణ్‌వీర్ సింగ్ సక్సెస్ చూసి భయపడి ఇదంతా చేస్తున్నారు.. ‘డాన్-3’ వివాదంపై ఆర్జీవీ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై సినీ కార్మిక సంఘం FWICE బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీనికి కారణం ఆయన ‘డాన్-3’ సినిమా నుంచి తప్పుకోవడమే అని సమాచారం. దీని వల్ల నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లగా.. ఈ వివాదంలోకి FWICE రంగంలోకి దిగి ఆయనను 3ఏళ్ల పాటు బ్యాన్ చేసింది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా, ఈ విషయంపై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు మద్దతుగా నిలిచారు. రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మధ్య జరుగుతున్న ఈ వివాదంలో ఫెడరేషన్ జోక్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. "రణ్‌వీర్‌ను కాదు.. ముందు FWICE ని బ్యాన్ చేయాలి. ఈ యూనియన్ వ్యవస్థ చాలా పాతబడిపోయింది. ఇండస్ట్రీలో తమ పట్టును కోల్పోకుండా ఉండటానికే ఇలా కండరాలు చూపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు.. ఇది కార్మికుల రక్షణ కోసం చేస్తున్న పని కాదు. ఈ ఫెడరేషన్ అనేది ఎలాంటి కోర్టు లేదా ప్రభుత్వ నియంత్రణ సంస్థ కాదు.

ఇదొక ‘కంగారూ కోర్ట్’ లాంటిది. రణ్‌వీర్ సింగ్ సాధిస్తున్న భారీ విజయాలను చూసి భయపడి, కొంతమంది ఒక అజెండాతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రణ్‌వీర్ వల్ల ఐదు లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టారనడం పెద్ద అబద్ధం.. ఇండస్ట్రీలో కార్మికుల జీవనోపాధి ఎప్పుడూ ఒక్క నటుడిపైనో లేదా ఒక్క ప్రాజెక్ట్ పైనో ఆధారపడి ఉండదు. ఇది కేవలం ఒక నిర్మాతకు, హీరోకు మధ్య ఉన్న ప్రైవేట్ కాంట్రాక్ట్ వివాదం దీనిని కోర్టులు చూసుకుంటాయి’’ అని అన్నారు చివరగా ఒక చేదు నిజాన్ని చెప్తూ.. "థియేటర్లలో టిక్కెట్లు అమ్మేది రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్స్ మాత్రమే, ఫెడరేషన్ కాదు. రణ్‌వీర్ లాంటి స్టార్స్ వల్లే లక్షలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతోంది. వారు ఉన్నారు కాబట్టే ఇండస్ట్రీ ఉంది, ఈ ఫెడరేషన్ కూడా ఉంది. రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన ఇంటి ముందు రేపు పొద్దున్నే ఒక కిలోమీటర్ పొడవున నిర్మాతలు చెక్కులతో క్యూ కడతారు. కాబట్టి ఇద్దరి మధ్య ఉన్న సివిల్ వివాదంలోకి వేలు పెట్టకండి" అని ఆర్జీవీ హితవు పలికారు. అంతకుముందు షారుఖ్ ఖాన్ నటించిన ‘డాన్’, ‘డాన్ 2’ చిత్రాల తర్వాత, 2023లో రణ్‌వీర్ సింగ్‌తో ‘డాన్ 3’ ప్రకటించారు, కానీ ఇప్పుడు వివాదాల వల్ల రణ్‌వీర్ దీని నుండి తప్పుకున్నారు.

Next Story