- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kalki 2: భారీ సెట్‌లో ‘కల్కి 2’ ఇంటర్వెల్
ప్రస్తుతం 'కల్కి 2' మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశాలను ఒక ప్రత్యేకమైన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దిశా పటాని హీరోయిన్‌గా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 AD’ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించగా, కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించాడు. ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. ఇలా భారీ విజయం సాధించిన సినిమా కావడంతో, ఈ మూవీ సీక్వెల్‌పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజుల క్రితం జరిగిన షెడ్యూల్‌లో ఈ మూవీ బృందం అమితాబ్ బచ్చన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశాలను ఒక ప్రత్యేకమైన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర మొదటి భాగాన్ని అత్యంత గ్రాండ్ గా రూపొందించిన సంగతి తెలిసిందే. అందుకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమా రెండవ భాగాన్ని కూడా నాగ్ అశ్విన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.






