,Sandeep Reddy Vanga : రణ్‌బీర్ లైనప్.. సందీప్ రెడ్డికి ఎఫెక్ట్

by Pulgam srinivas |   (  Updated:2026-04-22 06:14:28  IST  )

'స్పిరిట్' తర్వాత సందీప్ రెడ్డి వెయిట్ చేయాల్సిందే.

,Sandeep Reddy Vanga : రణ్‌బీర్ లైనప్.. సందీప్ రెడ్డికి ఎఫెక్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏదైనా సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావాలంటే హీరో, దర్శకుడు, నిర్మాతల సహకారం పూర్తిగా ఉండాల్సిందే. వారిలో ఎవరి సహకారం లేకపోయినా, తేదీలు అడ్జస్ట్ కాకపోయినా సినిమా సమయానికి పట్టాలెక్కే అవకాశాలు ఉండవు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈయన, ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు.

కొంతకాలం క్రితం ఈయన రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందించిన ‘యానిమల్’ చిత్రం దాదాపు 900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక రణ్‌బీర్ కపూర్ హీరోగా ‘యానిమల్ పార్క్’ చిత్రాన్ని ప్రారంభించాలని భావించాడు. రణ్‌బీర్ కూడా ఈ సినిమాను ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ కమిట్ అయిన చిత్రాల కారణంగా ‘యానిమల్ పార్క్’ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నటుడు ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.

మొదటి భాగం ఈ దీపావళికి, రెండో భాగం వచ్చే దీపావళికి విడుదల కానున్నాయి. ఇక ఇప్పటికే ఈ నటుడు ‘బ్రహ్మాస్త్ర 2’, ‘ధూమ్ 4’ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల చిత్రీకరణకు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమాల అనంతరం ‘యానిమల్ పార్క్’ షూటింగ్ ప్రారంభమైతే అప్పటికి చాలా సమయం గడిచిపోయే అవకాశం ఉంది. మరి రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేస్తాడా? లేక ఆ సినిమాలు పూర్తయ్యే వరకు అర్జున్ రెడ్డి దర్శకుడు వెయిట్ చేస్తాడా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

భారీ సెట్‌లో ‘కల్కి 2’ ఇంటర్వెల్

Next Story