మీ కోసం ఏదో వేచి ఉంది.. ఆసక్తికరంగా అక్కినేని కోడలు ఇన్‌స్టా పోస్ట్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-12 10:30:13  IST  )

తాజాగా శోభిత తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ కోసం ఏదో వేచి ఉంది’ అనే క్యాప్షన్ జోడిస్తూ.. చీకటిలో అని రాసి ఉన్న కైట్‌ను ఎగరవేస్తుంది.

మీ కోసం ఏదో వేచి ఉంది.. ఆసక్తికరంగా అక్కినేని కోడలు ఇన్‌స్టా పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(shobhitha Dulipala) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య(Naga Chaitanya)తో పెళ్లి తర్వాత ఈ చిన్నది చేయబోతున్న ఫస్ట్ మూవీ ‘చీకటిలో’(Chikatilo). అయితే ఈ మూవీ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) ఓటీటీలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్‌(Trailer) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా శోభిత తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

అందులో ‘సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ కోసం ఏదో వేచి ఉంది’ అనే క్యాప్షన్ జోడిస్తూ.. చీకటిలో అని రాసి ఉన్న కైట్‌ను ఎగరవేస్తుంది. ఇక ఆ పోస్ట్‌లో అక్కినేని కోడలు పెద్ద తిలకం బొట్టు పెట్టుకొని రెడ్ కలర్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుని చాలా అందంగా కనిపించింది. అలాగే గజ్జెలు పట్టుకున్న, సన్నజాజి పూల దండలు పట్టుకున్న పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అక్కినేని ఫ్యాన్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ రాబోతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Read More... రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వావ్ యమ్మీ అంటూ నెటిజన్ల కామెంట్స్

Next Story