- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వావ్ యమ్మీ అంటూ నెటిజన్ల కామెంట్స్
బద్రీ(Bhadri), జానీ(Johny) వంటి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జంటగా నటించి రేణు దేశాయ్(Renu Desai) ప్రేమలో పడింది.

దిశ, వెబ్‌డెస్క్: బద్రీ(Bhadri), జానీ(Johny) వంటి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జంటగా నటించి రేణు దేశాయ్(Renu Desai) ప్రేమలో పడింది. అలా కొన్నాళ్లు ఇద్దరు డేటింగ్ చేసిన అనంతరం వారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఒక పాప బాబు ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ మరో పెళ్ళి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతను చూసుకుంటుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం మరో పెళ్లి చేసుకున్నాడు.
ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. అలా దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘బ్యాడ్ గర్ల్స్’ మూవీలో కీరోల్ ప్లే చేసింది. ఇదిలా ఉంటే.. రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్టుతో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
యానిమల్స్‌కు సంబంధించిన, డివోషనల్ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రేణు తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో ‘టౌన్‌లో యమ్మీ వెజ్ ఫుడ్ ఆస్వాదిస్తున్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. ఇక స్టోరీలో ఈ ముద్దుగుమ్మ నిజంగా చాలా ముద్దుగా రెడీ అయింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు వావ్ యమ్మీ ఫుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






