- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'RAPO23'లో ఎస్.జె. సూర్య.. ఎన్ని కోట్ల పారితోషికమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
'RAPO23' సినిమా కోసం ఎస్.జె. సూర్య దాదాపు రూ.5 కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ పోతినేని హీరోగా తెరకెక్కనున్న ‘RAPO23’ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటించడమే కాకుండా, కథను కూడా స్వయంగా రాసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో దర్శకుడిగానూ ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. రామ్ సోదరుడు కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మొదట మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ను పరిశీలించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దాంతో ఆ పాత్ర కోసం తమిళ స్టార్ నటుడు ఎస్.జె. సూర్యను మేకర్స్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు ఎస్.జె. సూర్య దాదాపు రూ.5 కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారు అంటే రామ్ బలమైన కథను సిద్ధం చేసి ఉంటాడని, అందుకే మేకర్స్ భారీ స్థాయిలో రిస్క్ చేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ఫైనల్ చేసే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.






