ఆ విషయంలో చాలా భయపడ్డా.. అందుకే ‘గవర్నర్’ సినిమా కోసం జాగ్రత్తలు తీసుకున్నా: మనోజ్ బాజ్‌పాయ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-31 06:41:10  IST  )

ఈ క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను. నా లాంటి యాక్టర్స్ భాష విషయంలో తప్పులు చేయడానికి అస్సలు ఇష్టపడరు.

ఆ విషయంలో చాలా భయపడ్డా.. అందుకే ‘గవర్నర్’ సినిమా కోసం జాగ్రత్తలు తీసుకున్నా: మనోజ్ బాజ్‌పాయ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ‘గవర్నర్: ది సైలెంట్ సేవియర్’. చిన్మయి మాండ్లేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించగా.. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 12న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ బాజ్‌పాయ్ ‘గవర్నర్’ ఒప్పుకున్నప్పుడు చాలా భయపడ్డానని అందుకే.. డైలాగ్స్ విషయంలో జాగ్రత్త పడినట్లు పలు విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర మాట్లాడే భాష, యాస చాలా సహజంగా ఉండేలా చూసుకోవడమే తనకు పెద్ద టాస్క్ అని మనోజ్ బాజ్‌పాయ్ చెప్పారు. "ఈ క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను. నా లాంటి యాక్టర్స్ భాష విషయంలో తప్పులు చేయడానికి అస్సలు ఇష్టపడరు.

నేను బీహార్ నుంచి వచ్చాను కాబట్టి, ఎవరైనా భాషను తప్పుగా మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే నా డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాను" అని అన్నారు. సినిమాలో పాత్రలు సహజంగా కనిపించడంతో పాటు, అన్ని ప్రాంతాల ప్రజలకు సులభంగా అర్థం కావడం కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. మనం హిందీలో సినిమా చేస్తున్నప్పుడు ఆ భాష అందరికీ అర్థమయ్యేలా ఉండాలని, యాస మరీ ఎక్కువగా ఉంటే జనాలు అసలు కథను వదిలేసి కేవలం భాషపైనే దృష్టి పెడతారని అభిప్రాయపడ్డారు. అందుకే డైరెక్టర్, తాను కలిసి కథకు ఇబ్బంది లేకుండా, ఆ పాత్ర సంస్కృతి కనిపించేలా డైలాగ్స్ పలికామని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 90వ దశకంలో దేశంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, ఎదురైన సవాళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ కష్ట కాలంలో దేశాన్ని నడిపించిన ఒక ముఖ్యమైన వ్యక్తి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ కనిపించనున్నారు.

కలెక్షన్లలో దూసుకుపోతున్న హాలీవుడ్ హార్రర్ థ్రిల్లర్ 'అబ్సెషన్'

Next Story