- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పటికీ 'బేబీ' సినిమా డబ్బులు నాకు రాలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్‌కేఎన్
బేబీ' బ్లాక్‌బస్టర్ అయిన ఇప్పటికీ కొంతమంది నుంచి డబ్బులు రావాల్సి ఉందని ఎస్‌కేఎన్ చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంలో హీరోగా నటించారు. ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో నిన్న చిత్రబృందం మీడియాతో సమావేశమైంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరంను ఉద్దేశించి, "'క' సినిమా భారీ విజయం సాధించినప్పటికీ, ఆ చిత్ర నిర్మాత మాత్రం తమకు పెద్దగా లాభాలు రాలేదని చెప్పారు. దీనిపై మీ స్పందన ఏమిటి?" అని ప్రశ్నించారు. దీనికి కిరణ్ స్పందిస్తూ, "మాది చిన్న సినిమా. మా చిత్రానికి భారీ స్థాయిలో వసూళ్లు వచ్చి ఉండకపోవచ్చు.
కానీ సినిమా మాత్రం మంచి విజయం సాధించింది. అలాగే విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశాం. సినిమా ఏ స్థాయిలో ఆడింది, ఎంత వసూళ్లు సాధించింది అనే వివరాలు మీ వద్ద కూడా రికార్డుల రూపంలో ఉంటాయి" అని తెలిపారు. అదే సమయంలో నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ... ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన నిర్మాతకు భారీ లాభాలు వస్తాయని అనుకోవడం సరైంది కాదు. నేను నిర్మించిన 'బేబీ' సినిమా పెద్ద విజయం సాధించినప్పటికీ ఇప్పటికీ కొంతమంది నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు. నిర్మాతలకు వారి సొంత ఇబ్బందులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం, ఎస్‌కేఎన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లోకేష్ కనగరాజ్ ‘DC’ సినిమాకు సెన్సార్ షాక్.. A సర్టిఫికెట్‌తో విడుదల వాయిదా






