Arvind Swami : స్టార్ హీరో స్టేటస్ వచ్చాక పక్షవాతం.. ఎలా కోలుకున్నాడో తెలుసా?

by Pulgam srinivas |   (  Updated:2026-02-24 03:24:08  IST  )

అరవింద స్వామి మాట్లాడుతూ... కొంతకాలం క్రితం నాకు పాక్షికంగా పక్షవాతం రావడంతో 18 నెలల పాటు నేను బాధను అనుభవించాను. ఆ తర్వాత ఆయుర్వేద వైద్యం వల్ల నేను సెట్ అయ్యాను అని ఈ నటుడు చెప్పుకొచ్చాడు.

Arvind Swami : స్టార్ హీరో స్టేటస్ వచ్చాక పక్షవాతం.. ఎలా కోలుకున్నాడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : 90వ దశకంలో లవర్ బాయ్ గుర్తింపును సంపాదించుకున్న వారిలో అరవింద స్వామి ఒకరు. ఈయనకు రోజా, బొంబాయి సినిమాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈ రెండు సినిమాలతో తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరీర్ జెట్ స్పీడులో ముందుకు సాగుతున్న సమయంలోనే ఈ హీరోకి చిన్న గాయం అయింది. దానితో ఈ నటుడికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది.

ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయిన అరవింద స్వామి మళ్లీ సినిమాల్లో నటిస్తూ మంచి జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన తనకు పక్షవాతం వచ్చిన తర్వాత ఎలాంటి బాధలను ఎదుర్కొన్నాను, అందులో నుండి ఎలా బయటపడ్డాను అనే దాని గురించి వివరించాడు. అరవింద స్వామి మాట్లాడుతూ... నాకు పాక్షికంగా పక్షవాతం వచ్చింది. దానితో నేను ఎంతో బాధపడ్డాను. 18 నెలల పాటు నన్ను ఆ బాధ వెంటాడింది. ఆ తర్వాత నేను ఆయుర్వేద వైద్యం తీసుకున్నాను.

ఆ వైద్యం నా శరీరంపై ఎంతో బాగా పనిచేసింది. ఎంతో ప్రాచీరమైన ఆయుర్వేదం నేను బాగు కావడానికి దోహద పడింది. అందరికీ ఇది సరైనదని నేను చెప్పను, కానీ నాపై మాత్రం అద్భుతంగా పనిచేసిందని అరవింద స్వామి చెప్పుకొచ్చాడు. ఇక ఈ నటుడికి రీ ఎంట్రీలో తమిళంలో రూపొందిన తని ఒరువన్ మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత ఇదే సినిమాను తెలుగులో రామ్ చరణ్ హీరోగా ధ్రువ అనే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో కూడా ఈయన విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో తెలుగులో కూడా రీ ఎంట్రీలో భాగంగా ఈ నటుడికి మంచి గుర్తింపు దక్కింది.

'ఉస్తాద్ భగత్ సింగ్'లో పొలిటికల్ డైలాగ్స్.. సెటైర్స్ గురించి ఓపెన్ అయిన హరీష్ శంకర్

Next Story