- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఉస్తాద్ భగత్ సింగ్'లో పొలిటికల్ డైలాగ్స్.. సెటైర్స్ గురించి ఓపెన్ అయిన హరీష్ శంకర్
తాజాగా హరీష్ శంకర్ మాట్లాడుతూ... ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పొలిటికల్ డైలాగ్స్, సెటైర్స్ ఉంటాయని చాలామంది అనుకుంటున్నారు. అవి ఇందులో ఏమాత్రం ఉండవని ఈ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రాశిఖన్నా, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడం, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి విడుదల అయిన కొన్ని ప్రచార చిత్రాల్లో ఆయన గురించి చాలా గొప్ప వాక్యాలు ఉండడంతో కొంతమంది ఈ సినిమాలో రాజకీయ అంశాలు, పొలిటికల్ డైలాగ్స్, సెటైర్లు ఉంటాయనే అభిప్రాయానికి వచ్చారు. ఇక తాజాగా హరీష్ శంకర్ వీటిపై స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. తాజాగా హరీష్ శంకర్ మాట్లాడుతూ... ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పొలిటికల్ డైలాగ్స్, సెటైర్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అలా కొంతమంది అనుకుంటే పర్లేదు కానీ చాలామంది అనుకుంటున్నారు. దానితో నేను ఇప్పుడు ఈ వీడియోని విడుదల చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వేరు, సినిమా వేరు అని అంటున్నారు.
సినిమా స్టార్ట్ చేసే ముందు కూడా ఇందులో రాజకీయాలకు సంబంధించిన ప్రస్తావన ఏమాత్రం ఉండకూడదని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఈ సినిమాలో ఎలాంటి రాజకీయ పరమైన డైలాగులు, సెటైర్లు ఉండవు. ఆయన సినిమాల్లోకి రాజకీయ అంశాలు రాకుండా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సిద్ధాంతాలను కొంతమంది వ్యతిరేకించిన వారితో కూడా సినిమాల్లో నటిస్తాడు. ఆయన ఆలోచన విధానం అంత గొప్పగా ఉంటుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.






