ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. బర్త్‌డే స్పెషల్‌గా ఫస్ట్ గ్లింప్స్

by Chukka Sudharani |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్‌గా ‘AA-24’నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో సినీ క్రిటిక్ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. బర్త్‌డే స్పెషల్‌గా ఫస్ట్ గ్లింప్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. ‘AA-24’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై వస్తున్న పుకార్లు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతూ.. సినీ ప్రియుల్లో ఆతృతను పెంచుతున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఒక పవర్ ఫుల్ డాన్ కథగా రాబోతున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట దర్శనమిచ్చింది. ‘అల్లుఅర్జున్, అట్లీతో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ సగం పూర్తయింది. అతని పుట్టినరోజున స్పెషల్‌గా ఏప్రిల్ 8న మొదటి గ్లింప్స్ విడుదలవుతాయి’ అంటూ ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో దీపిక పడుకోణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వికపూర్‌లు నటిస్తున్నట్లు టాక్.



Next Story