ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను దాన్ని ముట్టుకోలేదు.. అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-06 05:37:24  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను దాన్ని ముట్టుకోలేదు.. అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గౌరవం’(Gouravam) సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన ఆ తర్వాత ‘కొత్త జంట’(Kotha Janta), ‘శ్రీరస్తు శుభమస్తు’(Srirastu Subhamastu), ‘ఒక్క క్షణం’(Okka Kshanam), ‘ఏబీసీడీ’(ABCD), ఊర్వశివో రాక్షసివో, బడ్డీ వంటి సినిమాలు చేశాడు. కానీ అంతగా గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయియి. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే.

గతేడాది అక్టోబర్‌లో శిరీష్ నయనికా రెడ్డి (Nayanika Reddy)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇక వీరి వివాహం నేడు జరగనున్నది. ఇక పెళ్లికి ముందు శిరీష్ - నయనికా బ్యాచిలర్ పార్టీని దుబాయ్‌లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహించిన ఆ పార్టీలో అల్లు బ్రదర్స్ అయిన బాబీ, అల్లు అర్జున్ (Allu Arjun), శిరీష్.. వారి ఫ్రెండ్స్, నయనికా ఫ్రెండ్స్ అందరూ పాల్గొని ఎంజాయ్ చేశారు.

ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఆల్కహాల్ తాగినప్పుడు నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ నుండి ఎస్కేప్ అయ్యాను. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆల్కహాల్ వదిలేశా. కనీసం మళ్ళీ ఎప్పుడూ టేస్ట్ కూడా చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు గుడ్ డెసిషన్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయ్యగారికి తప్పని రిలీజ్ టెన్షన్.. చరణ్ కోసం వెనక్కి తగ్గిన ‘లెనిన్’

Next Story