మా ఆయనతో పెళ్లి జరగాలని ఏడేళ్లు ఆ పని చేయలేదు.. అనసూయ షాకింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-01-28 03:53:37  IST  )

టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

మా ఆయనతో పెళ్లి జరగాలని ఏడేళ్లు ఆ పని చేయలేదు.. అనసూయ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇటీవల వచ్చిన అరి వంటి సినిమాల్లో.. కూడా ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా ట్రెడిషనల్‌గా పెంచింది.

శుక్రవారం, ఆ వారం ఈ వారం అని తేడా లేకుండా గుళ్ళకు తిప్పుతూ ఉల్లిపాయ తినకుండా చేసింది. అందుకే ఇప్పుడు ఏ ఫుడ్‌లో అయినా ఉల్లిపాయ లేకుండా తినను. నాకు ఉల్లిపాయలో ఉండే ఆ క్రంచ్ అంటే చాలా ఇష్టం. అయితే మా ఆయనను పెళ్లి చేసుకోవడం కోసం నేను 7 ఇయర్స్ నాకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ అండ్ ఆలుగడ్డ తినలేదు. సాయిబాబాకు చెప్పేసుకున్నాను 11 వారాలు ఉపవాసం కూడా ఉంటాను అతనితో నాకు పెళ్లి చేయమని కోరుకున్నాను. అలా సాయిబాబాకు నాకు ఇష్టమైన ఫుడ్‌ను వదిలేసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Similar News : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉపాసన డెలివరీ అయ్యేది ఎప్పుడంటే..

Next Story