- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉపాసన డెలివరీ అయ్యేది ఎప్పుడంటే..
మెగా కపుల్ రామ్ చరణ్- ఉపాసనల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా కపుల్ రామ్ చరణ్- ఉపాసనల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి మ్యారేజ్ అయిన 11 ఏళ్లకు క్లీంకార అనే పాప పుట్టింది. అయితే ఉపాసన మరోసారి తల్లి కాబోతున్న సంగతి విధితమే. అయితే ఆమె డెలివరీ డేట్ ఎప్పుడు అన్నదానిపై.. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. మెగా కోడలు ఉపాసనకు జనవరి 31న డెలివరీ జరగనుందని ప్రచారం జరుగుతోంది.
డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ కూడా ఈ సమయంలో తన భార్యకు దగ్గరగా ఉండాలని షూటింగ్స్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడట. అంతేకాకుండా ఆమె ట్విన్స్‌కు జన్మనివ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే డెలివరీ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.






