- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి కాకుండానే అమ్మ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది.. స్టార్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
‘పెళ్లి సందడి’(Pelli Sandadi) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం శివ కార్తికేయన్(Sivakarthikeyan) సరసన ‘పరాశక్తి’(Parasakthi) మూవీలో నటిస్తోంది. సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. రవి మోహన్(Ravi Mohan), అథర్వ మురళి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. శ్రీలీల 24 ఇయర్స్‌లోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని సాటి తారలకు ఆదర్శంగా నిలిచింది. తెరపై స్టార్ హీరోయిన్‌గా అలరిస్తూనే, తెర వెనుక ఓ పెళ్ళి కాకుండానే అమ్మగా తన గొప్ప మనసు చాటుకుంటుంది శ్రీ లీల. అయితే ఇటీవల తన దత్తత విషయంపై ఈ చిన్నది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘అమ్మతనంలోని మాధుర్యాన్ని అమ్మను కాకుండానే అనుభవించడం గమ్మత్తుగా ఉంది. 2019లో ‘కిస్’ అనే కన్నడ సినిమా చేశాను. ఆ సినిమా షూటింగ్ ఒక ఆశ్రమంలో జరిగింది. ఆ టైమ్‌లో ఆ పిల్లలతో ఏర్పడిన అనుబంధమే దత్తతకు దారి తీసింది.
ఎందుకో తెలియదు షూటింగ్ తర్వాత ఆ పిల్లల్ని విడిచి వెళ్లలేకపోయాను. వారి జ్ఞాపకాలు కొన్ని రోజులు వెంటాడాయి. 2022లో ఆ దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్నా. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నప్పటికీ.. మరికొంతమందికి ఇది ప్రేరణగా నిలుస్తుందనే ఉద్దేశంతో బయటకు చెప్పాను. నిజానికి ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నాకు మాటలు రావు. అప్రయత్నంగా నా గొంతు వణుకుతుంటుంది. ఇప్పటికీ ఆ పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటున్నా. నేను వాళ్లకు అమ్మను మాత్రమే కాదు, ఫ్రెండ్‌ని కూడా ’ అంటూ శ్రీ లీల ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More..






