‘పెద్ది’ భోపాల్ మ్యూజికల్ ఈవెంట్‌కు భారీ ఖర్చు.. అన్ని కోట్లు వెచ్చిస్తున్నారా?

by Pulgam srinivas |   (  Updated:2026-05-20 04:58:39  IST  )

‘పెద్ది’ భోపాల్ మ్యూజికల్ ఈవెంట్ కోసం రూ.150 కోట్ల విలువైన పరికరాలను ముంబై నుంచి తీసుకువెళుతున్నట్లు సమాచారం.

‘పెద్ది’ భోపాల్ మ్యూజికల్ ఈవెంట్‌కు భారీ ఖర్చు.. అన్ని కోట్లు వెచ్చిస్తున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మే 18న విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. భారీ స్థాయి యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ సినిమా బృందం మే 23న భోపాల్‌లో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్రంలోని స్పెషల్ సాంగ్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఈవెంట్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం ముంబై నుంచి సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రత్యేక పరికరాలను భోపాల్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ పరికరాల అద్దె ఖర్చు రోజుకు దాదాపు రూ.1 కోటి వరకు ఉండనున్నట్లు సమాచారం.

ఈ ఖర్చులను బట్టి చూస్తే, ‘పెద్ది’ మ్యూజికల్ ఈవెంట్‌ను చిత్ర బృందం అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ వారు భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు.

ఆ విషయంలో గురువును అలాగే అనుసరించిన బుచ్చిబాబు.. ‘పెద్ది’ ట్రైలర్‌తో క్లారిటీ

Next Story