ఆ విషయంలో గురువును అలాగే అనుసరించిన బుచ్చిబాబు.. ‘పెద్ది’ ట్రైలర్‌తో క్లారిటీ

by Pulgam srinivas |   (  Updated:2026-05-20 04:57:52  IST  )

‘రంగస్థలం’ సినిమాలో సమంత పాత్రను సుకుమార్ ప్రెజెంట్ చేసిన విధానాన్నే, ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్ర విషయంలో బుచ్చిబాబు కూడా అనుసరించినట్లు కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ విషయంలో గురువును అలాగే అనుసరించిన బుచ్చిబాబు.. ‘పెద్ది’ ట్రైలర్‌తో క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ దర్శకుల్లో ఒకరైన బుచ్చిబాబు సనా, దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సుకుమార్ తెరకెక్కించిన పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు, ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆయన తాజాగా రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల మే 18న ఈ చిత్ర ట్రైలర్‌ను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ట్రైలర్‌లో ఆమె కనిపించిన కొన్ని సన్నివేశాలు ప్రత్యేక చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరోయిన్‌ను చూపించే విషయంలో బుచ్చిబాబు తన గురువు సుకుమార్ శైలిని అనుసరించినట్లు కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది.

ఇందులో సమంత కొన్ని సన్నివేశాలలో తన పవిటను తీసేసి నడుము అందాలు హైలైట్ అయ్యే సన్నివేశాలు ఉంటాయి. అదే తరహాలో ‘పెద్ది’ ట్రైలర్‌లో జాన్వీ కపూర్ కనిపించిన కొన్ని సన్నివేశాల్లో కూడా ఆమె రంగస్థలంలో సమంత చేసిన మాదిరే చేయడంతో హీరోయిన్ ప్రెజెంటేషన్ విషయంలో బుచ్చిబాబు తన గురువు సుకుమార్ స్టైల్‌ను ఫాలో అయ్యారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

‘పెద్ది’ భోపాల్ మ్యూజికల్ ఈవెంట్‌కు భారీ ఖర్చు.. అన్ని కోట్లు వెచ్చిస్తున్నారా?

Next Story