- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజినీకాంత్, హృతిక్ రోషన్ షెడ్యూల్‌పై కీలక అప్ డేట్!

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘జైలర్ 2’ ఒకటి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పలువురు స్టార్ హీరోలు క్యామియో పాత్రల్లో కనిపిస్తూ సందడి చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీల నుంచి ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాడట హృతిక్. ఈ మేరకు అందుకున్న సమాచారం ప్రకారం.. 'జైలర్ 2'లో తన ప్రత్యేక పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను హృతిక్ పూర్తి చేసుకున్నాడట. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ హృతిక్ అండ్ రజనీకాంత్ ఇద్దరూ కలిసి కనిపించేలా ఒక కీలక సన్నివేశాన్ని రూపొందించారని, దీనివల్ల ఈ సీక్వెల్ పట్ల ఆసక్తి మరింత పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం, అభిమానులకు మరో అద్భుతమైన దృశ్యకావ్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు నెటిజన్లు. అయితే.. ఇప్పటి వరకు హృతిక్ పాత్రపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.






