- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పెషల్ సాంగ్‌లో నభా నటేష్!
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కలయికలో వస్తున్న చిత్రం ‘ఇరుముడి’.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కలయికలో వస్తున్న చిత్రం ‘ఇరుముడి’. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భక్తి, బలమైన కుటుంబ భావోద్వేగాల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ ఎప్పుడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ ఎమోషనల్ పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌లో వేగం పెంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ పంచుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘ఇరుముడి’లో ఓ ప్రత్యేక పాట కోసం యంగ్ అండ్ హాట్ బ్యూటీ నభా నటేష్‌ను సంప్రదించారట మేకర్స్. రవితేజతో కలిసి ఈ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు నభా నటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. అయితే.. ఇప్పుడిప్పుడు బెస్ట్ ఆఫర్స్ అందుకుంటున్న నభా ఇలాంటి టైమ్‌లో స్పెషల్ సాంగ్ ఓకే చెయ్యడం అవసరమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు.






