పేదల ఇండ్లు కూల్చొద్దు.. ఎంపీ వేం నరేందర్ రెడ్డికి సీపీఐ నాయకుల వినతి

by Ramesh Naini |

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని గురువారం సీపీఐ రాష్ట్ర నాయకులు హైదరాబాద్‌లో కలిశారు.

పేదల ఇండ్లు కూల్చొద్దు.. ఎంపీ వేం నరేందర్ రెడ్డికి సీపీఐ నాయకుల వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని గురువారం సీపీఐ రాష్ట్ర నాయకులు హైదరాబాద్‌లో కలిశారు. ఇటీవల హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో అమానుషంగా పేదల ఇండ్లు కూల్చివేత విషయాన్ని వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో నిరుపేదలు 50 గజాలలో ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్న వారందరికీ పట్టాలు ఇచ్చి ప్రభుత్వ సహాయం చేయాలే తప్ప నిర్ధాక్షిణ్యంగా వారి ఇండ్లను కూల్చివేసి రోడ్డున పడవేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని సూచించారు. దీనిపై వేం నరేందర్ రెడ్డి స్పందిస్తూ పేదలకు తప్పకుండా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వేం నరేందర్ రెడ్డిని కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి.నర్సింహా, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు ఉన్నారు.

Next Story