- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాచారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి సమీపంలో సిద్దిపేట రహదారిపై శుక్రవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి సమీపంలో సిద్దిపేట రహదారిపై శుక్రవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట గ్రామానికి చెందిన కోట అనిల్ యాదవ్ (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. కామారెడ్డి నుంచి షిఫ్ట్ కారు లో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు గంభీరావుపేట కు వెళుతుండగా వారు దారి తప్పి నర్మాల డ్యాం వైపు వెళుతుండగా కాకులగుట్ట తండా దాటిన తర్వాత గల కోళ్లఫాం మూల మలుపు వద్ద చెట్టు కు బలంగా ఢీ కొట్టారు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు లో అనిల్ అనే యువకుడు మృతి చెందగా అన్వేష్ గౌడ్, వికాస్ లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైదరాబాద్ కు తరలించారు. మర్రి చెట్టు కు బలంగా ఢీ కొట్టిన కారు లో ఆ ముగ్గురు ఇరుక్కుపోయారు. స్థానికుల సాయంతో మాచారెడ్డి పోలీసులు నానా అవస్థలు పడ్డారు. చివరకు గ్యాస్ కట్టర్ సహాయం తో అందులో ఇరుక్కున్న వారి ని బయటకు తీసి చూడగా ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు.






