- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం విజయ్ మార్క్.. జననాయగన్ నిర్మాతకు కీలక పదవి
జననాయగన్ సినిమా నిర్మాత వెంకట నారాయణకు తమ ప్రభుత్వంలో కీలక పదవి అప్పగించారు సీఎం విజయ్.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అగ్ర హీరో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల వారిని సంతృప్తి పరుచుతూ తన మార్క్ పాలన అందిస్తున్నారు విజయ్. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులను కూడా చేసి చూపిస్తున్నారు. గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అందించని పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
జననాయగన్ సినిమా నిర్మాత వెంకట నారాయణకు తమ ప్రభుత్వంలో కీలక పదవి అప్పగించారు. ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయనను నియమించారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా హీరో విజయ్ నటించిన జననాయగన్ నిర్మాతగా ఉంటూనే టీవీకే పార్టీ కార్యకర్తలలో వెంకట నారాయణ చాలా యాక్టివ్ గా ఉన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కృషి కూడా ఉంది. కాగా గతంలో విజయ్ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ కు ప్రత్యేక పదవి ఇవ్వగా విమర్శలు రావడంతో అతన్ని తప్పించారు. ఇక ఇప్పుడు నిర్మాతకే ప్రభుత్వంలో పదవి ఇవ్వడం కూడా విమర్శలకు తావు ఇవ్వనుంది. మరి దీన్ని సీఎం విజయ్ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.






