శ్రేయస్ అయ్యర్ ను అవమానించిన RCB... కెప్టెన్ ఫోటో లేకుండానే!

by velandi.Saikiran |

భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను అవమానిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోస్ట్ పెట్టింది.

శ్రేయస్ అయ్యర్ ను అవమానించిన RCB... కెప్టెన్ ఫోటో లేకుండానే!
X

దిశ‌, వెబ్ డెస్క్: సూర్య కుమార్ యాదవ్ ను తప్పించిన బీసీసీఐ, తాజాగా శ్రేయస్ అయ్యర్ కు టీ20 కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ నేపథ్యంలో అయ్యర్ కెప్టెన్సీ లోనే భారత జట్టు బరిలోకి దిగింది. అయితే ఈ సిరీస్ ప్రారంభమైన నేపథ్యంలో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను అవమానిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోస్ట్ పెట్టింది.

ఐర్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ నేపథ్యంలో భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, కొత్త కుర్రాడు వైభవ్ ఫోటోలు ఉన్నాయి. కానీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం లేడు. కొత్త కెప్టెన్, కొత్త శకం అదే పాత పట్టుదల అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ కూడా ఇచ్చింది. కానీ శ్రేయస్ అయ్యర్ ఫోటో మాత్రం వేయలేదు. దీనిపై అతని అభిమానులు సీరియస్ అవుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ను అవమానించేందుకే బెంగుళూరు యాజమాన్యం ఇలా వ్యవహరించిందని ఫైర్ అవుతున్నారు.

Next Story