నా జీవితంలో సిగరెటే ముట్ట‌లేదు..అలాంటిది హీరోయిన్ల‌తో !

by velandi.Saikiran |

త‌న‌ జీవితంలో సిగరెటే ముట్ట‌లేదంటూ గులాబీ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

నా జీవితంలో సిగరెటే ముట్ట‌లేదు..అలాంటిది హీరోయిన్ల‌తో !
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌న‌ జీవితంలో సిగరెటే ముట్ట‌లేదంటూ గులాబీ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కేటీఆర్‌, త‌నపై ప్ర‌త్య‌ర్థులు చేసిన ఆరోప‌ణ‌లపై క్లారిటీ ఇచ్చారు. త‌న‌ జీవితంలో నేను సిగరెట్ కూడా తాగింది లేదు.. అలాంటిది అడ్డమైన వెధవలంతా 'నువ్వు డ్రగ్స్ తీసుకుంటావ్' అని అంటున్నారని ఆగ్ర‌హించారు.

తాను డ్రగ్స్ తీసుకోవడం ఏంటి వీళ్ల బొంద.. అసలు ఇలా మాట్లాడే వాళ్లకు కనీసం బుద్ధి జ్ఞానం ఉందా? అంటూ ప్ర‌శ్నించారు. ఈ పిచ్చి మాటలేంటి? అని ఎప్పుడూ స్పందించలేదని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్‌. కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి, నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్ర‌హించారు. హీరోయిన్లతో లేనిపోని లింకులు అంటగట్టారని ఫైర్ అయ్యారు. హీరోయిన్ల ఫోన్స్ ట్యాప్ చేసి, వారి కాపురాల్ని కూల్చానని నాపై చెండాలపు వ్యాఖ్యలు చేశారని సీరియ‌స్ అయ్యారు. స్వయంగా సీఎం తన మంత్రుల చేత మాట్లాడిస్తుంటే.. ఈ దరిద్రంలోకి ఎందుకొచ్చానా అని బాధేసేదన్నారు.

Next Story