- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ వెరీ కాస్ట్‌లీ.. ఓల్డ్ సిటీలో గజం ఏకంగా..
తెలంగాణ ల్యాండ్స్ చాలా కాస్ట్‌లీ. కోకాపేటలో ఎకరం రూ.150 కోట్లు.. రాయదుర్గంలో ఎకరం రూ.237 కోట్లు. ఇది హెచ్ఎండీఏ, టీజీఐఐసీ వేలం పాటల్లో పలికిన ధరలు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ల్యాండ్స్ చాలా కాస్ట్‌లీ. కోకాపేటలో ఎకరం రూ.150 కోట్లు.. రాయదుర్గంలో ఎకరం రూ.237 కోట్లు. ఇది హెచ్ఎండీఏ, టీజీఐఐసీ వేలం పాటల్లో పలికిన ధరలు. అయితే సిటీ శివార్లల్లోనే కాదు హైదరాబాద్‌లో కూడా ధరలు పెరిగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ధరలు పక్కన పెడితే.. ఓల్డ్ సిటీలో గజం ధర ఏకంగా ఎనిమిది లక్షలు పలుకుతోంది. పాత బస్తీలో ఇరుకైన గల్లీలు ఉంటాయి కదా.. అంత ధర పెట్టి ఎవరు కొంటారనుకుంటే పొరపాటు. ఈ ధర చెప్తే నమ్మకపోవచ్చు. కానీ బేగంబజార్ ప్రాంతం వాణిజ్య, వ్యాపారాలకు మారు పేరు. ఇక్కడ దొరకని వస్తువు ఉండదు. ప్రతి రోజూ రూ.వేల కోట్ల లావాదేవీలు జరుగుతాయి. అందుకే ఇటీవల బేగంబజార్‌లో గజం స్థలానికి రూ.8 లక్షల దాకా పెట్టి ఓ వ్యాపారి స్థలాన్ని కొనుగోలు చేశారు. అది వేలు, వందల గజాల ప్లాటు కూడా కాదు. జస్ట్ 62 చదరపు గజాల స్థలానికి రూ.4.96 కోట్లు పెట్టారు. హైదరాబాద్‌లో సంప్రదాయ వాణిజ్య కేంద్రాలైన బేగంబజార్, సుల్తాన్‌బజార్, అబిడ్స్ ప్రాంతాల్లో గజాల లెక్కన భూముల విలువలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. అందుకే హైదరాబాద్ వెరీ కాస్ట్‌లీ గురూ!






