మొహర్రం వేడుకల్లో ఘర్షణ.. ఏకంగా ఐదురుగికి !

by velandi.Saikiran |

మొహర్రం పండుగ వేడుకల సందర్భంగా మాగనూరు మండలంలోని నేడుగం దొడ్డి గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మొహర్రం వేడుకల్లో ఘర్షణ.. ఏకంగా ఐదురుగికి !
X

దిశ, మాగనూర్: మొహర్రం పండుగ వేడుకల సందర్భంగా మాగనూరు మండలంలోని నేడుగం దొడ్డి గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీర్ల ఊరేగింపు బయలుదేరిన సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన మొత్తం ఐదుగురు గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మాగనూరు ఎస్సై అశోక్ బాబు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story