ఇక‌పై చిన్న జ‌ట్ల‌ను త‌క్కువ అంచ‌నా వేయొద్దు..అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్

by velandi.Saikiran |

ఐర్లాండ్ చేతిలో ఓట‌మి నేప‌థ్యంలో అయ్య‌ర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

ఇక‌పై చిన్న జ‌ట్ల‌ను త‌క్కువ అంచ‌నా వేయొద్దు..అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐర్లాండ్ చేతిలో భారత జట్టు చిత్తుగా ఓడింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా, 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విఫలమైన భారత్, ఐర్లాండ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన క్రమంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై చిన్న జట్లను తక్కువగా అంచనా వేయవద్దని, ప్రతి జట్టును సీరియస్ గా తీసుకొని ఆడాలని తన జట్టు సభ్యులకు సూచనలు చేశారు.

ఐర్లాండ్ చేతిలో జరిగిన పరాభవం మర్చిపోయి, నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని కోరారు. రెండో మ్యాచ్ లో కచ్చితంగా ఐర్లాండ్ ను ఓడిస్తామని ప్రకటించారు. టీ20 మ్యాచ్ ల‌లో ఫలితాలు తారుమారు కావడం చాలా కామన్ అంటూ వ్యాఖ్యానించారు. కానీ భవిష్యత్తులో మాత్రం జాగ్రత్తగా ఉంటామని వెల్లడించారు. చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా భారత జట్టు విజయానికి తోడ్పడాలని తన జట్టు సభ్యులకు దిశా నిర్దేశం చేశారు శ్రేయస్ అయ్యర్. ఇక ఆదివారం జరిగే మ్యాచ్ కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.

Next Story