సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన తల్లి విజయలక్ష్మి

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-26 17:18:26  IST  )

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ కేసును సీబీఐ లేదా స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు అప్పగించాల‌ని అత‌డి త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన తల్లి విజయలక్ష్మి
X

దిశ, వెబ్ డెస్క్: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ కేసును సీబీఐ లేదా స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు అప్పగించాల‌ని అత‌డి త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్ర‌స్తుతం సాయికృష్ణ కేసును సిట్ విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో సాయికృష్ణ త‌ల్లి కేసును సీబీఐకి అప్ప‌గించాలంటూ కోర్టును ఆశ్ర‌యించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే సిట్ అధికారులు కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌ర్చారు. సీఐ నాగ‌రాజుకు అతడి స్నేహితుడు, ఇద్ద‌రు సిబ్బంది స‌హ‌కరించిన‌ట్టు సిట్ ద‌ర్యాప్తులో తేలింది.

అయితే నాగ‌రాజు అరెస్ట్ త‌ర‌వాత ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నాని, అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మే 29న సాయికృష్ణ బంధువుల వ‌ద్ద‌కు వీరు ముగ్గురూ వెళ్లిన‌ట్టు అధికారులు గుర్తించారు. మే 29న వీళ్లు వడ్డేశ్వ‌రం వెళ్లిన‌ట్టు సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న ముగ్గురి కోసం అధికారులు గాలిస్తున్నారు. మరోవైపు సాయికృష్ణ ఘటనలో ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జీవించే హక్కుపై జరిగిన ఘోర దాడిగా అభివర్ణించింది. ఏపీ డీజీపీ, విజయవాడ సీపీలకు నోటీసులు జారీ చేసింది. డిలీట్‌ చేసిన సీసీటీవీ ఫుటేజీని రికవరీ చేయాలని.. బాధితుడి అస్థికలను వెలికితీయాలని ఆదేశించింది.

Next Story