పద్ధతి మార్చుకోకపోతే.. పనిస్మెంట్ తప్పదు

by Ratna Kumari |

పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని, అందరు తమ పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని భద్రాచలం డిఎస్ పి అరుణ్ కుమార్ రౌడీ షీటర్స్ ను హెచ్చరించి,

పద్ధతి మార్చుకోకపోతే.. పనిస్మెంట్ తప్పదు
X

దిశ భద్రాచలం : పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని, అందరు తమ పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని భద్రాచలం డి ఎస్ పి అరుణ్ కుమార్ రౌడీ షీటర్స్ ను హెచ్చరించి, కౌన్సిలింగ్ నిర్వహించారు.సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డి.ఎస్.పి రౌడీషీటర్ల ప్రవర్తన, వారి ప్రస్తుత జీవన విధానంపై ఆరా తీశారు. ఎవరెవరు ఏ ఏ కేసులలో ఉన్నారో క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత రౌడీషీటర్ల యొక్క జీవనశైలిని వారినే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాత నేర ప్రవృత్తిని మరియు నేరాలను విడనాడి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని హితవు పలికారు. నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. తమ ప్రవర్తన మార్చుకుని పట్టణంలో ఎలాంటి అలజడి సృష్టించకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉన్న వారిని రౌడీషీటర్ల జాబితా నుండి తొలగించేందుకు కృషి చేస్తామని, లేనియెడల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story