- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ల్యాప్‌టాప్ దొంగ అరెస్ట్
వరస లాప్ టాప్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

దిశ, శేరిలింగంపల్లి : వరస లాప్ టాప్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2025 సంవత్సరం నుండి వరుసగా ల్యాప్‌టాప్ చోరీలకు గురవుతుండడంతో గచ్చిబౌలి పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారుజామున డీఎల్ఎఫ్ రోడ్ లో అనుమానస్పదంగా తిరుగుతుండగా నేరస్థుడిని అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం వెల్లూరు ప్రాంతానికి చెందిన గోపి చిన్నన్నన్ (35) గత ఐదేళ్ల నుంచి వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. 2023లో పుణే పోలీసులు ల్యాప్‌టాప్ చోరీ కేసులో అరెస్టు చేయగా బెయిల్ పై విడుదలయ్యాడు. తరచూ తన స్థావరాన్ని మార్చుకుంటూ పోలీసులకు చిక్కకుండా నగరానికి వచ్చి ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నాడు. 2025 జనవరి నుండి మే వరకు హైదరాబాద్ ఐటీ కారిడార్ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు, విద్యార్థుల హాస్టళ్లు, ఐటీ ఉద్యోగుల నివాసం ఉండే ఇళ్లు, అపార్ట్‌మెంట్లు లక్ష్యంగా చేసుకుని ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు నగదు చోరీలకు పాల్పడ్డాడు. విచారణలో నిందితుడు మొత్తం 13 కేసుల్లో చోరీలు చేసినట్లు అంగీకరించాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసుల ,మాదాపూర్ లో 7 ,రాయదుర్గం, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు నమోదు అయింది. నిందితుడు వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్ ,ఒక ల్యాప్‌టాప్, రూ 1.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పగటి పూట చోరికి పాల్పడే ప్రాంతాలను పరిశీలించడం, ఉదయం 5 గంటల నుండి 8 గంటల మధ్య చోరీలకు చేయడం,తాళం వేయని తలుపులు, కిటికీల ద్వారా ఇళ్లలోకి ప్రవేశించి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, నగదు వంటి సులభంగా తీసుకెళ్లగల వస్తువులను లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలకు పాల్పడ్డాడు. ఎవరికి తనపై అనుమానం రాకుండా చెవిటి, మూగ వ్యక్తిగా నటిస్తాడు. అదును చూసి చాకచక్యంగా చోరీలకు పాల్పడతాడని గచ్చిబౌలి పోలీసులు చెప్పారు. కరుడుగట్టిన లాప్టాప్ దొంగను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను ఏసిపి కళింగ రావు అభినందించారు.






