గడువులోపు కొనుగోలు పూర్తి చేయడం అభినందనీయం

by Taduka Kalyani |

జిల్లాలో చేపట్టిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు నిర్ణీత గడువులోపు పూర్తి చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు

గడువులోపు కొనుగోలు పూర్తి చేయడం అభినందనీయం
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో చేపట్టిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు నిర్ణీత గడువులోపు పూర్తి చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో 1 కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగినందున తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్న రకం బియ్యంతో తయారుచేసిన 7 రకాల పిండి వంటల కిట్లను సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ యాసంగి వరి ధాన్యం, మొక్క జొన్నలు, జొన్నల కొనుగోలు నిర్ణీత గడువులోగా రైతులకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడంలో అధికారులకు కృషి అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

Next Story