గోవాలో మెరిసిన త్రిష‌..ఆ హీరో ప‌క్క‌నే కూర్చోని మ‌రీ !

by velandi.Saikiran |

గోవాలో మెరిసిన త్రిష పేరు ట్రెండింగ్ లోకి వ‌చ్చింది.

గోవాలో మెరిసిన త్రిష‌..ఆ హీరో ప‌క్క‌నే కూర్చోని మ‌రీ !
X

దిశ‌, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు 20 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో అగ్ర‌హీరోయిన్ గా కొన‌సాగుతున్నారు. ఏజ్ పైబ‌డిన‌ప్ప‌టికీ..కుర్ర హీరోయిన్ల‌కు పోటీని ఇస్తున్నారు. అలాంటి త్రిష ఇప్పుడు ఏం చేసినా పెద్ద వార్తే అవుతోంది. విజ‌య్ ముఖ్య‌మ‌త్రి అయిన త‌ర్వాత‌, త్రిషాకు పాపులారిటీ పెరిగింది. అయితే, ఆమె తాజాగా గోవాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో త్రిష పేరు ట్రెండింగ్ లోకి వ‌చ్చింది.

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పెద్ద కుమార్తె అవంతిక వివాహ వేడుక గోవాలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా మెరిశారు. ఇదే ఈవెంట్ కు హీరోయిన్ త్రిష కూడా వచ్చారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుక జరుగుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి పక్కన త్రిష కూర్చుని సందడి చేశారు. సాంప్రదాయ చీరకట్టులో, ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ నెక్లెస్ ధరించిన త్రిష.. మెగాస్టార్ చిరంజీవితో ముచ్చటిస్తూ సరదాగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Next Story