బిగ్ రిలీఫ్‌..బంగ్లాపై భారత్ విక్టరీ

by velandi.Saikiran |   (  Updated:2026-06-25 17:42:14  IST  )

లీగ్ స్టేజ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఉమెన్స్ టీమ్ అద్భుతమైన విక్టరీ నమోదు చేసుకుంది.

బిగ్ రిలీఫ్‌..బంగ్లాపై భారత్ విక్టరీ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉమెన్స్ వరల్డ్ కప్ 2026లో భారత జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. లీగ్ స్టేజ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఉమెన్స్ టీమ్ అద్భుతమైన విక్టరీ నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన తర్వాత ఈ మ్యాచ్ లో నిల‌దొక్కుకుంది భార‌త్. మాంచెస్టర్ వేదికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఏకంగా ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్స్ ఆడి, ఎనిమిది వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోరాడిన భారత జట్టు, 16.5 ఓవర్లలో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి విక్టరీ నమోదు చేసుకుంది. ఇక గ్రూప్ స్టేజ్ లో భాగంగా ఈ నెల 28వ తేదీ ఆస్ట్రేలియాతో ఇండియా చివ‌రి మ్యాచ్ ఆడ‌నుంది.

Next Story