ప్ర‌భాస్‌ ‘స్పిరిట్’లో మరో సీనియర్ నటి.. పాత్ర ఇదే?

by velandi.Saikiran |

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా స్పిరిట్.

ప్ర‌భాస్‌ ‘స్పిరిట్’లో మరో సీనియర్ నటి.. పాత్ర ఇదే?
X

దిశ‌, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా ఈ సినిమాలో ప్రభాస్ మెరువనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి రోజుకో గాసిప్ వైరల్ గా మారుతోంది.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మరో న్యూస్ హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. స్పిరిట్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయట. ఆ సమయంలోనే నటి రవీనా స్క్రీన్ పై సందడి చేస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ మూవీలో నదియా కూడా కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Next Story