- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లెనిన్’ సినిమాలో గెస్ట్ రోల్..రంగంలోకి స్టార్ హీరో ?
‘లెనిన్’ సినిమాలో గెస్ట్ రోల్ ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని, ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్... సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లెనిన్ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటిస్తుండగా, భాగ్య శ్రీ హీరోయిన్ గా మెరువనున్నారు. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో స్పెషల్ రోల్ చేస్తున్నారట. దాదాపు 15 నిమిషాల పాటు ఈ మూవీలో ఆ స్టార్ హీరో కనిపించనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది.
అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమా చివరలో అక్కినేని నాగార్జున సూచనల మేరకు మార్పులు-చేర్పులు చేశారట. ఈ మూవీలో భాగ్యశ్రీ, అఖిల్ మధ్య లవ్ ట్రాక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నట్లు కూడా తెలుస్తోంది. సినిమా అవుట్ ఫుట్ పట్ల చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉందని కూడా చర్చ జరుగుతోంది. దీంతో ఈ సినిమా పక్కగా హిట్ అవుతుందని అంటున్నారు. కాగా సినిమా జులై 10వ తేదీన రిలీజ్ కానుంది.
- Tags
- akhil
- lenin movie






