ఇవాళ్టి నుంచి ఐర్లాండ్ తో టీ20 సిరీస్...వైభవ్ ఎంట్రీ ఫిక్స్!

by velandi.Saikiran |

ఇవాళ్టి నుంచి ఐర్లాండ్ తో టీ20 సిరీస్ షురూ కానుంది. ఈ త‌రుణంలోనే వైభ‌వ్ ఎంట్రీ ఇస్తార‌ని అంటున్నారు.

ఇవాళ్టి నుంచి ఐర్లాండ్ తో టీ20 సిరీస్...వైభవ్ ఎంట్రీ ఫిక్స్!
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బెల్ఫాస్ట్ వేదికగా ఈ రెండు మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 సమయంలో భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్, టీ20 అరంగేట్రం చేస్తాడా ? లేదా ? అనే దానిపైన సందిగ్ధత నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఇవాళ జరగబోయే మ్యాచ్ ఆడతాడని అంటున్నారు. సంజు పైన వేటు వేసి, వైభవ్ కు అవకాశం ఇస్తారని సమాచారం అందుతోంది. మరి వైభవ్ సూర్యవంశీ విషయంలో గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

భార‌త జ‌ట్టు అంచ‌నా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk)/ వైభ‌వ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (c), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్

Next Story