ఆస్ప‌త్రిలోనే ముద్రగడకు చికిత్స‌..ప‌రామ‌ర్శించిన సజ్జల

by velandi.Saikiran |

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను తాజాగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు.

ఆస్ప‌త్రిలోనే ముద్రగడకు చికిత్స‌..ప‌రామ‌ర్శించిన సజ్జల
X

దిశ‌, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ పార్టీలో చాలా యాక్టివ్ గా ముందుకు సాగుతున్న ఆయన, కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని సింధు అనే ప్రముఖ ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభంకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను తాజాగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకొని... ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముద్రగడ కుమారుడు గిరిబాబు, ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు సజ్జల. పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని వారికి భరోసా కల్పించారు.

Next Story